Tuesday, November 2, 2010

పిక్నిక్ స్పాట్



Details : 18mm, F/20, 4s, ISO 200, Manual mode
మా ఇంటి దగ్గర అడవిలో తీశా.
స్విస్ లో ఎంత చిన్న అడవి కానివ్వండి, అందులో ఇలాంటి చిన్న ఇల్లు ఒకటుంటుంది ఎవరన్న వెళ్లి పిక్నిక్ చేసుకోవడానికి. అలా చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా ఆ అడవి వుండే ఏరియా మున్సిపాలిటీకి వెళ్లి బుక్ చేసుకోవాల్సి వుంటుంది. వాళ్ళు ఆ ఇంటి తాళం ఇస్తారు. కొన్ని చోట్ల అద్దె వసూలు చేస్తారనుకుంటా (మనం వదిలేసిన చెత్త క్లీన్ చెయ్యడం వంటి మెంటెనెన్స్ ఖర్చుల కోసం).